శిమ్లా వెళ్లి వస్తుండగా లోయలో పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు.. స్వల్ప గాయాలతో.. - హిమాచల్ ప్రదేశ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Congress MLA Car Accident : శిమ్లా పర్యటనకు వెళ్లి వస్తున్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అనంతరం బోల్తా పడి చెట్టుకి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో జరిగింది. పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాణా గుర్జీత్ సింగ్.. కారులో శిమ్లా పర్యటనకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో అటవీ ప్రాంతంలో ఆయన కారు అదుపు తప్పి లోయలో పడింది. స్పల్వగాయాలతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే నాయకులు చండీగఢ్ ఆస్పత్రికి గుర్జీత్ సింగ్ను తరలించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సోలన్ పోలీసులు తెలిపారు.