చిదంబరానికి నిరసన సెగ.. సొంత పార్టీ న్యాయవాదుల నుంచే.. - కాంగ్రెస్ నాయకుడు చిదంబరానికి నిరసన సెగ
🎬 Watch Now: Feature Video
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరానికి నిరసన సెగ తగిలింది. ఓ కేసు వాదించడానికి కోల్‌కతా హైకోర్టుకు ఆయన బుధవారం వెళ్లారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన సొంత పార్టీ న్యాయవాదులు నిరసన తెలిపారు. చిదంబరానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల వస్త్రాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం చిదంబరమేనని ఆరోపించారు. టీఎంసీ పార్టీ సానుభూతిపరుడు అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ కేసులో టీఎంసీ తరఫున వాదించడం వల్లే చిదంబరానికి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది. బెంగాల్‌లోని మెట్రో డైరీ సంస్థలోని కొన్ని వాటాలను తృణమూల్ ప్రభుత్వం ప్రైవేటు అగ్రో ప్రాసెసింగ్ కంఎపీ కేవెంటర్‌కు విక్రయించింది. అయితే ఈ విక్రయాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌధరీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసులో చిదంబరం కేవెంటర్‌కు మద్దతుగా తృణమూల్ తరఫున వాదనలు వినిపించేందుకు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ న్యాయవాదుల నుంచి నిరసన ఎదుర్కొన్నారు.
Last Updated : May 4, 2022, 10:22 PM IST