స్కూల్లో బాంబు పేలుడు.. పైకప్పు ధ్వంసం.. విద్యార్థులు హడల్! - టీటాగఢ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
బంగాల్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఉత్తర 24 పరగణాల జిల్లా టీటాగఢ్లోని ఫ్రీ ఇండియా హైస్కూల్‌లో శనివారం మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పాఠశాల పైకప్పు ధ్వంసమైంది. విరామ సమయంలో ఘటన జరగడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు పెను ప్రమాదం తప్పింది. హఠాత్తుగా భారీ శబ్ధం రావడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఉపాధ్యాయులు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.