పాఠశాలలోకి ప్రవేశించిన ఎలుగుబంటి.. విద్యార్థులు హడల్! - ఎలుగుబంటి వీడియో
🎬 Watch Now: Feature Video
Bear Entered Into School: జనావాసాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతోంది. పులులు, ఏనుగులతో పాటు ఎలుగుబంట్లు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని బరబస్పుర్ పాఠశాలలో ఓ ఎలుగుబంటి హల్చల్ సృష్టించింది. పాఠశాల ఆవరణలో భల్లూకం సంచరించడం వల్ల గ్రామస్థులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. గ్రామస్థులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు గోడ పోస్టర్లు కూడా అంటించారు. ఎలాంటి సమయంలోనైనా ఎలుగుబంటి కనిపించినా.. వెంటనే అటవీశాఖ బృందానికి తెలియజేయాలని తెలిపారు. ఎలుగుబంటి సంచరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Last Updated : Jun 18, 2022, 11:16 AM IST