8 కిలోల బాహుబలి సమోసా.. నెక్ట్స్ టార్గెట్ 10కేజీలు! - 8 కేజీల సమోసాను తయారు చేసిన వ్యాపారి
🎬 Watch Now: Feature Video
సాయంత్రం అయిందంటే చాలు కొందరికి స్నాక్స్ ఉండాల్సిందే. అందులో సమోస అంటే చాలా మంది ఇంకా ఇష్టంగా తింటారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి.. ఏకంగా 8 కేజీల సమోసాను తయారు చేశాడు. మేరఠ్‌లోని లాల్‌కుర్తిలో స్నాక్స్ దుకాణం నడిపిస్తున్న శుభమ్ కౌశల్.. శనివారం భారీ సమోసాను తయారు చేసి బాహుబలి సమోసాగా పేరు పెట్టాడు. దీని తయారీకి రూ.1100 ఖర్చు అయిందని చెప్పాడు. అంతేకాకుండా త్వరలోనే పది కేజీల సమోసాను తయారు చేయబోతున్నట్లు తెలిపాడు.
Last Updated : Jul 3, 2022, 9:59 AM IST