ఇద్దరు యువకులపై 20మంది ఆర్మీ అభ్యర్థుల మూక దాడి.. కర్రలతో కొట్టి.. రాళ్లు రువ్వి.. - ఇద్దరు యవకులపై మూక దాడి
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్లోని మోరెనా నగరంలో ఉన్న అంబేద్కర్ స్టేడియంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇద్దరు యువకులపై సుమారు ఇరవైమందికి పైగా ఆర్మీ ఉద్యోగార్థులు కర్రలతో దాడి చేశారు. వద్దని ప్రాధేయపడుతున్నా వినిపించుకోకుండా వెంటాడి మరీ గాయపరిచారు. అంతటితో ఆగకుండా.. బాధితులపైకి రాళ్లు రువ్వి కాల్పులు కూడా జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులిద్దరినీ.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తమపై వారంతా ఎందుకో దాడిచేశారో తెలియదని బాధితులు చెబుతున్నారు.