'నేను బతికే ఉన్నా సారూ'.. పెన్షన్ కోసం 102ఏళ్ల వృద్ధుడి బరాత్! - unique protest To prove himself alive
🎬 Watch Now: Feature Video
'మీ రికార్డులు తప్పు.. నేను బతికే ఉన్నా.. దయచేసి పెన్షన్ ఇవ్వండి' అంటూ వినూత్న నిరసన ప్రదర్శన చేశాడు 102 ఏళ్ల వృద్ధుడు. హరియాణా రోహ్తక్ జిల్లా గంద్రా గ్రామానికి చెందిన దులీ చంద్‌కు మార్చి నుంచి వృద్ధాప్య పింఛను ఆగిపోయింది. ఏంటా అని ఆరా తీస్తే.. అతడు చనిపోయాడని రికార్డుల్లో నమోదైంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తనదైన శైలిలో తీసుకెళ్లాలని అనుకున్నాడు ఆ పెద్దాయన. వరుడిలా ముస్తాబై, గుర్రపు బండి ఎక్కి.. మేళతాళాలు, యువకుల నృత్యాల మధ్య గురువారం రోహ్తక్లో బరాత్ నిర్వహించాడు. ఇప్పటికైనా తాను బతికే ఉన్నట్లు నమ్మి, పెన్షన్ వచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని కోరాడు. మాజీ మంత్రి, భాజపా నేత మనీశ్ గ్రోవర్‌ను కలిసి ఇదే విషయంపై విజ్ఞాపన పత్రం అందజేశాడు దులీ చంద్.