seetimaarr interview: గోపీచంద్‌ను ఇమిటేట్ చేసిన నటి - గోపీచంద్ సీటీమార్ ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'(seetimaarr movie). కబడ్డీ నేపథ్యంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించారు. వినాయక చవితి కానుకగా నేడు (సెప్టెంబర్ 10) థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొన్న సినిమా యూనిట్ పలు విషయాలు పంచుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్లు, ఇందులో నటించిన యువతులు తెగ సందడి చేశారు. సెట్లో గోపీచంద్‌ను వారు ఆటపట్టించిన విధానంతో పాటు చిత్రీకరణ సమయంలోనే పరీక్షలు రాయాల్సి రావడం, ఆ సమయంలో వారు పడిన ఇబ్బందుల గురించి వెల్లడించారు.