thumbnail

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? చుండ్రు​ సమస్య వెంటాడుతోందా? ఈ టిప్స్ మీకోసమే!

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 5:35 PM IST

Winter Skin Care Tips In Telugu : చలికాలం వచ్చిందంటే చాలు కొందరికి జలుబు, దగ్గు, ఆస్తమా, పొడి చర్మం వంటి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. శీతాకాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యంగా చర్మం పొడిబారిపోవటం కూడా ఒకటి. చలిగాలుల కారణంగా చర్మం​ పొడిబారి నిర్జీవంగా మారిపోతుంది. ఫలితంగా దురద మంట వంటి ఏర్పడతాయి. పెదాలు డ్రైగా అవ్వడం, మడమల్లో పగుళ్లుతో పాటు మోకాళ్లు, మోచేతులు వంటి భాగాల్లో చర్మం కందిపోయినట్లుగా నల్లగా, గరుకుగా మారిపోతుంటుంది. చివరకు జుట్టు చుండ్రు పట్టేస్తుంది. సోరియాసిస్​ వంటి మొండి వ్యాధులు కూడా చలికి మరింత ఇబ్బంది పెడతాయి. ఈ నేపథ్యంలో చలి నుంచి మన శరీరాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సోరియాసిస్​ లాంటి జబ్బులను అదుపులో ఉంచుకుని శీతకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? వీటిన్నంటికీ ఈ సమాధానాలు కావాలా? అయితేపై వీడియో చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.