Vande Bharat Train Ganesh Idol : వందేభారత్ రైలు నమూనాలో గణేశుడు.. 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో.. - రైలులో గణేషుడి విగ్రహ ప్రతిష్ఠ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-09-2023/640-480-19567364-thumbnail-16x9-vande--bharat--train--ganesh--idol.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Sep 21, 2023, 11:12 AM IST
Vande Bharat Train Ganesh Idol : దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు భక్తులు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ముంబయిలో వందేభారత్ రైలు నమూనాలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు. రైలును తలపించే ఈ మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. రైలు పట్టాలపై వందేభారత్ ఉన్నట్లు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ గణేశుడు కొలువై ఉన్న ఈ రైలును ఎక్కేందుకు రూ.2,505 రూపాయలను టిక్కెట్ ధరగా చెల్లించాలి భక్తులు. కాగా.. ఈ ట్రైన్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో సైతం ఉంది. అచ్చం వందేభారత్ రైలు ఎలా ఉంటుందో అలాగే ఈ మండపాన్ని రూపొందించారు నిర్వహకులు. ఈ వందేభారత్ రైలును చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.
కాగా.. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితోనే ఇలా వందేభారత్ రైలులో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు డిజైనర్ దీపక్ మక్వానా తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలా విభిన్నమైన థీమ్‌లతో గణేశుడి విగ్రహాన్ని పెడుతున్నామని చెప్పారు.