Building Collapse: కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. అందరూ చూస్తుండగానే

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 18, 2023, 5:00 PM IST

Two Floors building Collapse in Anakapally: అందరూ చూస్తుండగానే అనకాపల్లిలోని ఓ రెండతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నగరంలోని పెరుగు బజారు రహదారి విస్తరణ పనులు నిర్వహిస్తుండగా ఈ భవనం నెలకొరిగింది. పెరుగు బజారు నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులను జీవీఎంసీ అధికారులు చేపట్టి.. 50 అడుగుల మేర రహదారిని విస్తరిస్తున్నారు. విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాలను తొలగించాలని యాజమానులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఓ భవనాన్ని 10 అడుగుల మేర తొలగించాల్సి వచ్చింది. ఆ భవన యాజమాని భవనం పూర్తిగా దెబ్బతినకుండా.. పది అడుగుల వరకే కూల్చటానికి ప్రయత్నించాడు. కూల్చాలనుకున్న దాన్ని 10 అడుగుల వరకే మార్కింగ్​ ఇచ్చి.. మిగతా భవనానికి సంబంధం లేకుండా గోడలు తొలగించాడు. ప్రొక్లెయిన్ సహాయంతో 10 అడుగుల మేర భవనాన్ని తొలగించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ భవనంలోని కింది భాగాన్ని తొలగిస్తుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ దృశ్యాలు చూడటానికి భూకంపం వచ్చి భవనం కుప్పకూలినట్లుగా కనిపించాయి. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.