ETV Bharat / offbeat

పప్పులు, పెరుగు, సోడా ఏదీ వద్దు - బియ్యంతోనే "కమ్మటి చిట్టి పునుగులు" ఇలా చేయండి! - PUNUGULU RECIPE IN TELUGU

- ఈవెనింగ్ స్నాక్స్​ కోసం బెస్ట్​ ఆప్షన్​ - ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

Punugulu at Home
How to Make Punugulu at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 1:05 PM IST

How to Make Punugulu at Home : పునుగులు.. మనలో చాలా మందికి ఇష్టం. ఉల్లిపాయ ముక్కలు, పల్లీ, టమాటా చట్నీ కాంబినేషన్​గా ఉంటే ఇక వాటికి తిరుగుండదు. అయితే.. ఇంట్లో పునుగులు చేయాలంటే చాలా ప్రాసెస్​ ఉంటుందని.. ఎక్కువ మంది బయటకు వెళ్లి రోడ్ సైడ్ బండ్ల దగ్గర తింటుంటారు. కానీ.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఏ పప్పులూ నానబెట్టకుండానే, మైదా లేకుండానే పునుగులు తయారైపోతాయి. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - 1 కప్పు
  • బంగాళదుంపలు - 3
  • పచ్చిమిర్చి - 2
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • జీలకర్ర - 1 స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం :

  • పునుగులు చేయడం కోసం.. ముందుగా రేషన్ బియ్యాన్ని మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి. (అయితే, ఇక్కడ మీరు నార్మల్​ రైస్ కూడా తీసుకోవచ్చు. కానీ, రేషన్ బియ్యమైతే పునుగులు సూపర్ టేస్టీగా ఉంటాయి.)
  • అలాగే బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసుకోవాలి. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆపై నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వడకట్టాలి. తర్వాత మిక్సీ జార్​లో వేసుకోవాలి.
  • ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కాస్త గట్టిగానే ఉండేలా మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి. ఆపై పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలూ ముక్కలను మిక్సీ జార్​లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఆలూ పేస్ట్​ని ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యప్పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • తర్వాత పిండిలో ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • చివరిగా జీలకర్ర కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. (పిండి మరీ పల్చగా ఉండకుండా కాస్త గట్టిగానే ఉండేలా చూసుకోవాలి.)
  • ఇప్పుడు పునుగులు వేయించడం కోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్​ హీట్ ​అయ్యాక.. చేతితో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పునుగుల మాదిరిగా నూనెలో వేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి గరిటెతో వాటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ అవి మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. (అయితే, ఇలా బియ్యం పిండి, ఆలూతో చేసిన పునుగులు.. మామూలు పునుగుల మాదిరిగా గోల్డెన్ బ్రౌన్​ కలర్​లోకి రావు. కాస్త తెలుపు రంగులోనే ఉంటాయి.)
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే.. సూపర్ టేస్టీగా ఉండే "చిట్టి చిట్టి పునుగులు" రెడీ!
  • ఈ పునుగులను ఆనియన్స్, టమాటా చట్నీతో తింటుంటే ఆ టేస్ట్ భలే ఉంటుంది!

ఇవి కూడా చదవండి :

నోరూరించే "మ్యాగీ ఆమ్లెట్​" - టేస్ట్​ అద్దిరిపోతుందంతే!

ఎప్పుడూ ఫ్రెంచ్​ ఫ్రైస్​ బోర్​ - వెరైటీగా "బీట్​రూట్​ ఫ్రైస్"​ చేయండి - మళ్లీ మళ్లీ కావాలంటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.