ETV Bharat / bharat

MVAకు చావుదెబ్బ! ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసిన మహాయుతి- 60ఏళ్లలో తొలిసారి ఇలా! - NO LOP IN MAHARASHTRA ASSEMBLY

ప్రతిపక్ష నేత(ఎల్​ఓపీ) లేకుండా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు - ఎల్​ఓపీకి అవసరమయ్యే కనీస స్థానాలు సాధించని ఎమ్​వీఏ పార్టీలు - 60ఏళ్లలో తొలిసారిగా ఇలా

No LOP In Maharashtra Assembly
No LOP In Maharashtra Assembly (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 1:01 PM IST

Updated : Nov 24, 2024, 1:20 PM IST

No LOP In Maharashtra Assembly : మహారాష్ట్రలో మహాయుతి సృష్టించిన ప్రభంజనం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక పరిస్థితికి దారితీసింది. ఆరు దశాబ్దాలలో తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత(ఎల్​ఓపీ) హోదా ఖాళీగా ఉండనుంది. ఈ మేరకు మహా వికాస్ అఘాడీ పార్టీలు కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్​సీపీ(ఎస్​పీ)కు ఎల్​ఓపీ అవకాశం లేదని మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి(లెజిస్లేచర్) అనంత్ కల్సే ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి బలం ఆధారంగా ఎల్​ఓపీని నామినేట్​ చేయడం కుదరదని, నిబంధనల ప్రకారం ఏ పార్టీకి అయినా కచ్చితంగా కనిష్ఠ సంఖ్యలో సభ్యుల బలం ఉండాలని తెలిపారు. ఎమ్​వీఏ ఎంత ఘోరంగా పరాజయం పాలైందో చెప్పడానికి ఈ పరిస్థితే నిదర్శనం.

మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి 230 స్థానాల్లో విజయం సాధించింది. ఎల్​ఓపీ హోదా రావాలంటే ప్రతిపక్ష పార్టీకి కచ్చితంగా 29 సీట్లు రావాలి. ఎమ్​వీఏలో ఏ పార్టీకి ఇన్ని సీట్లు రాలేదు. చట్టం ప్రకారం మొత్తం సీట్లలో ప్రతిపక్ష పార్టీలు కనిష్ఠంగా 10శాతం స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. శివసేన(యూబీటీ) 20 స్థానాలు గెలిచినా, ఎల్​ఓపీ హోదాకు ఇంకా 9 సీట్లు తగ్గాయి.
శనివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 16(101 స్థానాల్లో పోటీ చేసి), ఎన్​సీపీ(ఎస్​పీ) 10 సీట్లకు పరిమితమైంది. ఇక మహాయుతిలో బీజేపీ సింహభాగం 132(149 సీట్లలో పోటీ చేసి) స్థానాల్లో విజయం సాధించింది. శివసేన(శిందే) 57 సీట్లలో, ఎన్​సీపీ(అజిత్) 41 సీట్లలో గెలుపొందాయి.

పశ్చిమ మహారాష్ట్రలో మహాయుతి ప్రభంజనం
పశ్చిమ మహారాష్ట్రలో మహాయుతి ప్రభంజనం సృష్టించింది. ఈ ప్రాంతంలోని 70 నియోజకవర్గాల్లో 53 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక్కడ ఎమ్​వీఏకు 12 సీట్లు మాత్రమే వచ్చాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ 12 సీట్లు సాధించినా, తాజా ఫలితాల్లో రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. పృథ్విరాజ్ చవాన్, బాలసాహెబ్​ థోరట్, సంగ్రామ్​ థోప్టే వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు మహాయుతిలో దాదాపు కీలక నేతలందరూ గెలిచారు.

మహారాష్ట్రలో 'మహాయుతి' సునామీ- కూటమి ధాటికి కొట్టుకుపోయిన పార్టీలు ఇవే!

స్థానికల అంశాలకే పెద్దపీట- ఉచితాలకూ జై- చిన్నపార్టీలతో దోస్తీ- BJP రూట్ ఛేంజ్​!

Last Updated : Nov 24, 2024, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.