ఫైబర్ నెట్ కేసు - సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ - డిసెంబరు 12కి విచారణ వాయిదా - Chandrababu case updates
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-11-2023/640-480-20150948-thumbnail-16x9-chandrababu-bail-petition.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Nov 30, 2023, 4:33 PM IST
Supreme Court Adjourned Hearing on Chandrababu Bail Petition: ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ముందుగా చంద్రబాబు పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబరు 12వ తేదీకి వాయిదా వేసింది. గత నెల 13, 17, 20, నవంబరు 9 తేదీల్లో ఇదే పిటిషన్ ధర్మాసనం ముందుకు వచ్చింది. అప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆ తీర్పు ఇచ్చిన తర్వాత దీన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తులు గత విచారణ సమయంలో స్పష్టం చేశారు. 17ఏ అంశంపై తీర్పు ప్రాసెస్‌లో ఉందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలపగా.. ఆ అంశంపై తీర్పు వచ్చాకే ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారిస్తామని ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. అప్పటివరకు అరెస్టు చేయవద్దన్న నిబంధన కొనసాగుతుందని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం. త్రివేది ధర్మాసనం తెలిపింది.