ఆమె బ్యాగ్​లో 22 పాములు, ఊసరవెల్లి.. ఎయిర్​పోర్ట్​లో అధికారులు షాక్

🎬 Watch Now: Feature Video

thumbnail

Snake smuggling : వివిధ జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లిని స్మగ్లింగ్​ చేస్తూ ఓ మహిళ విమానాశ్రయ కస్టమ్స్​ అధికారులకు పట్టుబడింది. 28 ఏప్రిల్​ 2023న ఏకే13 విమానంలో కౌలాలంపూర్​ నుంచి చెన్నై వచ్చిన మహిళ.. వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికింది. మహిళ చెక్​-ఇన్​ లగేజీపై చెన్నై విమానాశ్రయం అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే మహిళను అడ్డుకుని ఆమె బ్యాగ్​లను పరిశీలించారు. ఆ బ్యాగుల నుంచి మొత్తం 22 పాములతో పాటు ఓ ఊసరవెల్లిన బయటకు తీశారు. అనంతరం కస్టమ్స్​ చట్టం 1962, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద మహిళపై కేసు నమోదు చేశారు. వన్య ప్రాణులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చెన్నై కస్టమ్స్​ అధికారులు సోషల్​ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు.

అంతకుముందు.. జనవరిలో ఇలాంటి ఘటన జరిగింది. ఆ సమయంలో 45 బాల్ కొండచిలువలు, మూడు మార్మోసెట్‌లు, మూడు నక్షత్రాల తాబేళ్లు, ఎనిమిది కార్న్​ పాములను చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.