Smoke in Vande Bharat Train: వందే భారత్ రైలులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం - Accident news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-08-2023/640-480-19225702-470-19225702-1691594429209.jpg)
Smoke in Vande Bharat Train: నెల్లూరు జిల్లాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు రావడంతో మనుబోలు రెల్వే స్టేషన్‌లో దాదాపు గంటసేపు నిలిపివేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు మనుబోలు దగ్గర్లోకి రాగానే పొగలు రావడం మొదలయ్యాయి. సిబ్బంది గుర్తించి వెెంటనే లోకో పైలట్‌కు సమాచారం ఇచ్చారు. రైలును స్టేషన్‌లో నిలపడంతో భయాందోళనలో ఉన్న ప్రయాణికులు కిందకు దిగేశారు. రైలులో మూడో బోగీలోని బాత్‌రూమ్ నుంచి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి పరిశీలించగా.. అక్కడ కాల్చి పడేసిన సిగరెట్ ముక్క సామగ్రికి అంటుకోవడం వల్ల పొగలు వచ్చాయని నిర్ధారించారు. ఈ ఘటనకు కారణమైన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Train Derailed at Kadapa Railway Station: వైఎస్ఆర్ కడప జిల్లాలోని రైల్వే స్టేషన్లో మెమో ప్యాసింజర్ రైలుకు ప్రమాదం తప్పింది. నంద్యాల నుంచి కడపకు వచ్చిన రైలు పట్టాలు తప్పింది. ప్రయాణికులంతా స్టేషన్లో దిగిన తర్వాత పట్టాలు తప్పడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్టేషన్‌కు చేరుకున్న రైలు తిరిగి నుంచి నంద్యాలకు వెళ్లేందుకు మరో ప్లాట్ ఫారంలోకి మారే సమయంలో పట్టాలు తప్పి.. రెండు బోగీలు పక్కకు ఒరిగాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.