'షిర్డీ సాయిబాబా సంస్థాన్‌పై అసత్య ప్రచారం.. ఆ వీడియోలను నమ్మొద్దు' - పాగాలా మసీదు విరాళం బంగ్లాదేశ్ వివాదం
🎬 Watch Now: Feature Video
Shirdi Saibaba Sansthan Trust Donation Controversy : షిర్డీ సాయిబాబా సంస్థాన్‌పై తప్పుడు ప్రచారాలను భక్తులు నమ్మవద్దని సంస్థాన్ సీఈఓ పీ. శివశంకర్ సూచించారు. కొద్ది రోజుల క్రితం.. బంగ్లాదేశ్‌లోని పాగాలా మసీదులో షిర్డీ సాయి సంస్థాన్‌కు చెందిన వ్యక్తిగా నటిస్తూ.. డబ్బు చెల్లిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ 'ఫేక్' వీడియోలో.. షిర్డీ సాయి ఆలయానికి విరాళాలు ఇవ్వవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. తర్వాత దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు.. ఈ వ్యవహారంపై ఏం చర్యలు తీసుకున్నారని తమను అడిగినట్లు శివశంకర్ వెల్లడించారు. ఈ తప్పుడు ప్రచారంపై పోలీసులు, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోను ఎవరూ నమ్మవద్దని, షేర్ చేయొద్దని ఆయన సూచించారు. అసత్య ఆరోపణ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో పాటు గత నెలన్నర రోజులుగా షిర్డి సాయి మందిరానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని ఆయన తెలిపారు. ఈ సమయంలో రూ. 47 కోట్లు విరాళాలు వచ్చినట్లు వెల్లడించారు.