School Bus Overturned : బస్సు నిండా విద్యార్థులు.. ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా.. లైవ్​ వీడియో - గాజియాబాద్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 19, 2023, 6:57 AM IST

Updated : Aug 19, 2023, 2:12 PM IST

School Bus Overturned In Ghaziabad : 20 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్​ స్కూల్​ బస్సు ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో ఐదుగురు చిన్నారులతో పాటు బస్సు డ్రైవర్​, క్లీనర్​కు గాయాలయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​.. సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

వీడియో చూస్తుంటే.. బస్సును డ్రైవర్ టర్నింగ్​ కోసం వెనక్కి పోనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో రోడ్డు పక్కన గుంత ఉండగా.. డ్రైవర్​ దాన్ని గమనించకపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో చిన్నారులు.. త్రుటిలో తప్పించుకున్నప్పటికీ.. పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అనుభవం లేని డ్రైవర్​ను నియమించారని ఆరోపిస్తున్నారు. 

అయితే ఈ ఘటన.. గాజియాబాద్​లోని ట్రోనికా సిటీ పోలీస్​స్టేషన్​ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిందని ఏసీసీ రజనీశ్​ ఉపాధ్యాయ తెలిపారు. ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని.. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.

Last Updated : Aug 19, 2023, 2:12 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.