Prathidwani: టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన ఏపీ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది..? - ETV Bharat pratidhwani
🎬 Watch Now: Feature Video
Published : Sep 14, 2023, 9:12 PM IST
Pratidhwani Debate on TDP and Janasena Alliance: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన కలిసే పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విస్పష్ట ప్రకటన చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఈ కీలక నిర్ణయాన్ని పనన్ కల్యాణ్ వెల్లడించారు. మరి ఈ రెండు పార్టీల పొత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మా కోసం కాదు పొత్తు పెట్టుకునేది రాష్ట్ర భవిష్యత్తు కోసం అని పవన్ అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంత ప్రమాదంలో పడటానికి కారణం ఏంటి? పొత్తు ప్రకటనతో పాటు ఇరుపార్టీల ప్రతినిధుల మాటల్లో ఉన్న ఇతర సందేశాలు ఏమిటి ? రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాము, ఇకపై కలిసి పనిచేస్తాము అని చంద్రబాబును కలిసి వచ్చిన అనంతరం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆంద్రప్రదేశ్ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.