Big Size Fish in Nizamabad : చెరువుల్లో మామూలుగా 5 నుంచి 10 కిలోల చేపలు దొరకడమే కష్టం. అప్పుడప్పుడు ఎవరైనా పెద్ద చేపలు కావాలని వస్తే మత్స్యకారుల దగ్గర నుంచి లేదనే సమాధానం వస్తుంది. ఇలా ఎప్పుడూ 5 కిలోల చేపలకే పరిమితం అయ్యే మత్స్యకారులకు భారీ చేప వలకు చిక్కితే ఆ ఆనందంమే వేరు. కచ్చితంగా వారు ఎగిరి గంతేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపుర్ గ్రామ ఊర చెరువులో మత్స్యకారులకు 25 కేజీల భారీ చేప వలలో చిక్కింది. ఈ చెరువులో ఈ చేప ఎన్నాళ్లు పెరిగిందో తెలీదు గానీ ఏకంగా ఇంత పెద్ద చేప చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద భారీ చేప దొరకడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఇంత పెద్ద చేప వలకు చిక్కిన విషయం గ్రామస్థులకు తెలియడంతో చేపను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఆనందంతో ఆ పెద్ద చేపతో ఫొటోలు దిగారు. ఏది ఏమైనా ఈ చెరువులో ఇంత పెద్ద చేప దొరకడంతో మత్స్యకారులకు కాసుల పంట పండినట్లే. కష్టపడ్డ దానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ 'రామలు చేప'ను మీరెప్పుడైనా తిన్నారా? - 'పులస' టేస్ట్‌కు ఏమాత్రం తగ్గదు! ఓసారి ట్రై చేయండి
ఈ 'పాము'ను మీరెప్పుడైనా తిన్నారా? - ఒక్కసారి రుచి చూస్తే ఇక వదిలిపెట్టరు!