Petition in High Court on Chandrababu Arrest: చంద్రబాబు తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా - Court verdicts on Chandrababu case
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2023, 1:26 PM IST
Petition in High Court on Chandrababu Arrest: స్కిల్‌డెవలప్‌మెంట్ వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తీరు అక్రమమని మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు. ఈ క్రమంలో హైకోర్టులో చంద్రబాబు తరఫున న్యాయవాది దమ్మాలపాటి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌ను రేపు విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు అక్రమమని, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17-A ప్రకారం అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారని పిటిషన్ దాఖలు చేశారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని పెర్కొన్నారు. దీనిపై వాదనలు వినిపిస్తాం అని పిటిషన్‌లో దమ్మాలపాటి పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి తదుపరి విచారణ బుధవారం చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.