జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో ఎంపీ రఘురామ పిటిషన్ - ఈ నెల 24న విచారణ చేపడతామన్న ధర్మాసనం - Andhra Pradesh top news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 4:00 PM IST

Updated : Nov 22, 2023, 5:50 PM IST

MP Raghurama Petition SC on Jagan Bail Cancellation: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో.. అక్రమాస్తుల కేసు వ్యవహారంలో వైఎస్ జగన్ గత పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని, కేసులపై విచారణ వేగవంతం చేసి.. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

SC Hearing on Raghurama Petition on This Month 24th: ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు ఈ నెల 24న (శుక్రవారం) విచారణ చేపట్టనుంది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా వైఎస్ జగన్‌ బెయిల్‌పై ఉన్నారని, కేసులపై విచారణ వేగవంతం చేసి, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్‌ చేశారు. ఆ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. అనంతరం రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ.. ఎంపీ రఘురామ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Last Updated : Nov 22, 2023, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.