Man Dragged By Car : ట్యాక్సీ డ్రైవర్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు.. మృతదేహాన్ని వదిలేసి పరార్ - ట్యాక్సీ డ్రైవర్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-10-2023/640-480-19737275-thumbnail-16x9-man-dragged-by-car.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Oct 11, 2023, 12:54 PM IST
Man Dragged By Car In Delhi : ట్యాక్సీ డ్రైవర్‌ను ఢీకొట్టి కిలోమీటర్ మేర లాక్కెళ్లాడు ఓ కారు డ్రైవర్. ఈ ప్రమాదంలో ట్యాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని దిల్లీలోని మహిపాల్పుర్లో జరిగింది. కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని పట్టించుకోకుండా అలానే కిలోమీటర్ దూరం లాక్కెళ్లి.. ఓ చోట వదిలేసి పారిపోయాడు. ఈ ఘటన దిల్లీ - గురుగ్రామ్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగింది. దీనిని అదే రోడ్డుపై వెళ్తున్న మరో ప్రయాణికుడు వీడియో తీయగా.. వైరల్‌గా మారింది. మంగళవారం రాత్రి 11.20 గంటలకు తమకు సమాచారం వచ్చిందని నైరుతి దిల్లీ డీసీపీ మనోజ్ తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా తీవ్ర గాయాలపాలై ఓ వ్యక్తి మృతి చెందాడని చెప్పారు. అనంతరం దర్యాప్తు చేయగా.. మృతుడు హరియాణా ఫరీదాబాద్‌కు చెందిన బిజేందర్గా తేలిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని.. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.