Leaders Comments on TDP-JanaSena Alliance: 'టీడీపీ-జనసేన పొత్తు శుభపరిణామం.. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి..' - టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 3:47 PM IST

Leaders' comments on TDP-Jana Sena alliance : జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని తెలుగుదేశం నేతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి  పోటీ చేయడం శుభ పరిణామమని, రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి  చేయడమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు.

జగన్ మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని ఎదుర్కోడానికి అన్ని శక్తులు ఏకం కావాలి. ఆ కోణంలోనే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా ప్రకటన చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందా అన్న పరిస్థితుల్లో అందరూ కలసికట్టుగా జగన్​ ను ఓడించాల్సిన అవసరం ఉంది అని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అన్నారు. టీడీపీ మహిళా విభాగం నేత వంగలపూడి అనిత మాట్లాడుతూ రాక్షస సంహారానికి ప్రతి ఒక్కరూ ఏకం కావాలి. సైకో పాలనకు చరమ గీతం పాడాలి. అన్ని శక్తులు ఏకమైతేనే దుష్ట సంహారం జరుగుతుంది. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం అనేది శుభపరిణామంగా భావించాలి. పొత్తు ఖరారు (alliance finalized) పై చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం అని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.