ఫామ్‌హౌస్‌లో కుమారస్వామి చండికా హోమం.. 300 మంది పూజారులను పంపిన కేసీఆర్! - దేవెగౌడ కోలుకోవాలని యాగం చేస్తున్న మాజీ సీఎం
🎬 Watch Now: Feature Video
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తన నియోజకవర్గం బిడాదిలోని కేతుగానహళ్లిలోని భారీ యాగం నిర్వహించారు. తన ఫామ్‌హౌస్‌లో 300 మంది అర్చకుల సమక్షంలో యాగం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పంచరత్న యాత్ర విజయవంతం కావాలని.. ఈ యాగం నిర్వహించారు. దీంతో పాటు జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కోలుకోవాలని.. కుమారస్వామి దంపతులు పూజలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు శత చండికా యాగం, కోటి మృత్యుంజయ పూజలు కొనసాగనున్నాయి. కుమారస్వామి కుటుంబ సభ్యులైన హెచ్‌డీ రేవణ్ణ, నిఖిల్ కుమారస్వామి, రేవతి పూజలో పాల్గొన్నారు. కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి యాగంలో పాల్గొని పూజలు నిర్వహించారు.
కుమారస్వామి పాల్గొనే యాగంలో తెలంగాణకు చెందిన 300 మందికి పైగా నైపుణ్యం కలిగిన అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు. వీరంతా తెలంగాణ నుంచి గురువారం రాత్రి బిడాది ఫామ్‌హౌస్‌లో యాగం చేసేందుకు వచ్చారు. వీరంతా బస చేసేందుకు గార్డెన్‌లో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కుమారస్వామిల మధ్య మంచి స్నేహం ఉండడం వల్ల ఆయనే స్వయంగా పూజారులను పంపించినట్లు సమాచారం. ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కుమారస్వామి ఈ యాగం చేస్తున్నారని తెలుస్తోంది.