మహిళ వేషధారణలో పురుషుల పూజలు.. ఒక్కొక్కరు ఐదు దీపాలు వెలిగించి..
🎬 Watch Now: Feature Video
కేరళ కొల్లాం జిల్లాలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వందలాది మంది పురుషులు మహిళ వేషధారణలో.. శ్రీ కొట్టంకులంగర దుర్గ భగవతి ఆలయంలో దీపార్చన చేశారు. పురుషులు.. మహిళల వేషధారణలో వచ్చి ఇక్కడ పూజలు చేయడం సంప్రదాయంగా భావిస్తారు. రెండు రోజుల పాటు జరిగే చమయవిళక్కు ఉత్సవాల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా భారీగా పాల్గొన్నారు. వారు కూడా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా మలయాళి నెల 'మీనం'.. 10 ,11వ తేదీల్లో జరుపుకుంటారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో వచ్చి.. ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలు వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారు.
ఇదీ కథ.. ఓ రోజు కొందరు పిల్లలు ఆవులు మేపడానికి అడవికి వెళ్లారు. అక్కడ వారికి ఒక కొబ్బరికాయ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని.. బండ రాయితో పగలగొట్టే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా రాయిలోంచి రక్తం కారింది. దీంతో ఆ పిల్లలు భయపడి.. వాళ్ల తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. అనంతరం వారు జ్యోతిషులను సంప్రదించారు. ఆ రాయిలో వనదుర్గ శక్తి దాగుందని వెంటనే అక్కడ ఆలయం నిర్మించాలని జ్యోతిషులు చెప్పారు. దీంతో స్థానికులు గుడి కట్టి.. ప్రతీఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.