IT Employees Car Rally in Hyderabad : చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
🎬 Watch Now: Feature Video
Published : Sep 16, 2023, 3:30 PM IST
|Updated : Sep 17, 2023, 6:28 AM IST
IT Employees Car Rally in Hyderabad : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు సంఘీభావంగా ఓఆర్ఆర్ రహదారిపై పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి స్వచ్చందంగా భారీగా కారు ర్యాలీ చేశారు. సుమారు 1500 వాహనాలతో గచ్చిబౌలి, నానక్ రాంగూడ ఔటర్ జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ పై ర్యాలీని మొదలుపెట్టారు. 160 కిలో మీటర్లు ప్రయాణించి సాయంత్రం 6 గంటల వరకు నానక్ రాంగూడ టోల్గేట్ దగ్గర ముగించారు.
Chandrababu Followers Rally in Hyderabad : ర్యాలీ మధ్యలో పటాన్ చెరువు వద్ద వాహన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఐటీ ఉద్యోగులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచోసుకుంది. అనంతరం ముందుకు కదిలిన ఐటీ ఉద్యోగులు.. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని, ఏపీలోని అరాచకపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు లేని రీతిలో ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున కారు ర్యాలీ నిర్వహించడంతో ఓఆర్ఆర్ రహదారి మొత్తం ఆరు గంటల పాటు వాహనాలతో నిండిపోయింది. చంద్రబాబు(Chandrababu)ను విడుదల చేసే వరకు తమ నిరసనలు ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తూనే ఉంటామని ఐటీ ఉద్యోగులు వెల్లడించారు.