లక్కీ గర్ల్.. పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్న చిన్నారి - పాము కాటు నుంచి తప్పించుకున్న బాలిక
🎬 Watch Now: Feature Video
కర్ణాటక బెళగావి జిల్లాలోని హలగా గ్రామంలో ఓ బాలిక అదృష్టవశాత్తు నాగుపాము కాటు నుంచి తప్పించుకుంది. ఇంటి గుమ్మం వద్ద బుసలు కొడుతూ ఉన్న ఓ పామును గమనించకుండా అలాగే ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. బాలిక తలుపు వద్దకు రాగానే పాము తలపైకి ఎత్తి ఆమెను కరిచేందుకు చూసింది. అయితే కొన్ని క్షణాలు గుమ్మం డోర్ దగ్గర నిలబడ్డ ఆ చిన్నారిని లోపల ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడం వల్ల ఆమె ఇంట్లోకి పరుగులు తీసింది. క్షణాల్లోనే ప్రాణాపాయం నుంచి బయటపడింది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు గది దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషన్ మీడియాలో వైరల్‌గా మారింది.
రెండు నెలల క్రితం కూడా అచ్చం ఈ తరహా ఘటనే కేరళలో వెలుగు చూసింది. ఇడుక్కి జిల్లా కూత్తర్ పట్టణంలోని ఓ ఏటీఎం డోర్ దగ్గర పాము కలకలం సృష్టించింది. నాగుపామును గమనించని ఓ మహిళ డబ్బు విత్‌డ్రా కోసం ఏటీఎం లోపలకు ప్రవేశించింది. డ్రా చేసుకుని తిరిగి వెళుతుండగా డోర్ దగ్గర బుసలు కొడుతున్న పామును చూసి ఒక్కసారిగా వణికిపోయింది. భయంతో డోర్ వెనక్కు వెళ్లి దాక్కుంది. కొన్ని నిమిషాలు గడిచాక అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఏటీఎంలోని మహిళను గమనించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. అదృష్టవశాత్తు ఆ మహిళను పాము కాటు వేయకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చూడాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.