Prathidhwani : మహిళా బిల్లు.. చట్టంగా మారేనా..? - ఏపీ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Sep 19, 2023, 10:03 PM IST
Prathidhwani on Women Reservation Bill : సమానత్వ పునాదులపైనే మహిళా సాధికారత సాధ్యం. కానీ.. అందుకు కీలకమైన రాజకీయ నాయకత్వం అవకాశాల్లో ఎక్కడ ఉన్నాం? దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే సమయం ఆసన్నమైంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్రకేబినెట్ ఆమోదం(Union Cabinet approved) తెలపడం.. వెంటనే లోక్‌సభ ముందుకు తీసుకుని రావడం చకచకా జరిగిపోయాయి. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్న వేళ.. ఈ బిల్లు చట్టంగా మారితే లోక్‌సభ, శాసనసభలన్నింటిలో అతివలకు 33% అవకాశాలు అందిస్తాయి. ఇంతకాలానికి మహిళల చిరకాలస్వప్నం నెరవేరనుంది.
Women Reservation Bill Full Details : 1996లో దేవెగౌడ హయాంలో తొలిసారి లోక్‌సభలోకి ప్రవేశపెట్టారు. వాజ్‌పేయీ, మన్మోహన్ హయాంలోనూ సభలోకి బిల్లుపై చర్చ జరిగింది. అనంతరం 2010లో మహిళాకోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరి మహిళా సాధికారిత సాధన దిశగా ఈ కోటా ప్రాధాన్యత ఏమిటి? ఈ క్షణం కోసం ఏడున్నర దశాబ్దాల్లో ఎన్ని సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది? ఈ చారిత్రక సందర్భంపైనే నేటి ప్రతిధ్వని.