'వరద నీటిలో 25వేల మంది.. సైన్యం సహాయంతో..'.. 'ఈటీవీ భారత్' గ్రౌండ్ రిపోర్ట్‌లో సీఎం!
🎬 Watch Now: Feature Video
ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్, లక్సర్‌లో వార్షాలు బీభత్సం సృష్టించాయి. లక్సర్‌లోని సోలానీ నదిపై వంతెన కూలిపోయింది. దీంతో దాదాపు 4 లక్షల మంది వరద వల్ల ప్రభావితులయ్యారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
ముఖ్యమంత్రితో పాటు 'ఈటీవీ భారత్' ప్రతినిధుల బృందం క్షేత్ర స్థాయి పరిస్థితిని రిపోర్ట్ చేశారు. వరద పరిస్థితిపై 'ఈటీవీ భారత్'తో సీఎం మాట్లాడారు. దాదాపు 25,000 మందికి పైగా వరదలో చిక్కుకున్నారని తెలిపారు. 50 గంటల పాటు విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ విపత్తును ఎదుర్కొవడానికి సైన్యం సహాయం కూడా తీసుకుంటున్నామని వెల్లడించారు.
క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్లిన 'ఈటీవీ భారత్' బృందానికి హరిద్వార్ సీడీఓను వివరాలు అందించారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉన్నామని సీడీఓ తెలిపారు. బోటు, తెప్పల ద్వారా అధికారులు ఆయా ప్రాంతాలను సందర్శిస్తున్నారని.. బాధితులకు సహాయక సామాగ్రిని అందజేస్తున్నారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.