'ఒడ్డుకు రా మిత్రమా'.. ఏనుగుకు తోటి గజరాజు సాయం - ఒకదానికొకటి సాయం చేసుకున్న ఏనుగులు తమిళనాడు
🎬 Watch Now: Feature Video
సాటి మనిషి చనిపోతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో.. ఓ ఏనుగు కళ్లు తెరిపించింది. తన తోటి ఏనుగు బురదలో చిక్కుకోగా.. చాలా సేపు శ్రమించి దాన్ని బయటకు తీసుకొచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది.
వేసవి తాపానికి సత్యమంగళం టైగర్ రిజర్వ్, అసనూర్ ఫారెస్ట్‌లోని చెరువులు, కుంటలు ఎండిపోయాయి. దీంతో ఏనుగులు మేత, నీరు వెతుక్కుంటూ ఆసనూరు అడవుల్లో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో ఆసనూరు అడవుల్లోని ఆరెపాళ్యం చెరువులో నీరు తాగేందుకు ఏనుగులు వచ్చాయి. రెండు ఏనుగులు చెరువు మధ్యలో నీళ్లు తాగుతుండగా.. ఒక ఏనుగు బురదలో కూరుకుపోయి.. కదలలేకపోయింది. దీంతో అక్కడే ఉన్న మరో ఏనుగు తన తొండంతో.. బురదలో చిక్కుకున్న ఏనుగును ముందుకు తోసింది. చాలా సేపు ప్రయత్నం తర్వాత ఆ ఏనుగును బయటకు తీసింది. అనంతరం రెండు ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. అయితే, ఈ దృశ్యాల్ని అటుగా వెళ్తున్న స్థానికుడు తన మొబైల్లో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.