Delhi Waste To Wonder Park : సిటీలోని వ్యర్థాలతో వండర్ పార్కు.. 20దేశాల జంతువుల శిల్పాల ఏర్పాటు.. మీరు చూశారా?
🎬 Watch Now: Feature Video
Delhi Waste To Wonder Park : అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జీ-20 సమావేశాలను పురస్కరించుకుని దిల్లీ ప్రభుత్వం.. నగర సుందరీకరణ పనులు చేపట్టింది. అందులో భాగంగా దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరంలోని వ్యర్థాలతో 'వేస్ట్ టు వండర్' పార్కును.. డిప్లోమాటిక్ ఎన్‌క్లేవ్‌కు సమీపంలో నిర్మిస్తున్నారు. ఈ పార్కు నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో పూర్తిగా వ్యర్థాలతో తయారు చేసిన శిల్పాలను ఏర్పాటు చేశారు.
20 దేశాలకు చెందిన..
Waste To Wonder Park In Delhi : 'వేస్ట్ టు వండర్' పార్కులోని శిల్పాల్లో మరో ప్రత్యేకత ఉంది. 20 దేశాలకు చెందిన అరుదైన జంతువులు, పక్షుల శిల్పాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. విగ్రహాల ముందు ఆ జీవాల ప్రాముఖ్యతను తెలిపే సమాచార ఫలకాలను ఉంచనున్నారు. సమావేశాల సమయంలో ఈ శిల్పాలను కౌటిల్య మార్గ్‌లోని T పాయింట్ వద్ద ప్రదర్శిస్తారు. వసుదైక కుటుంబం ఇతివృత్తంతో దిల్లీ ప్రగతి మైదాన్‌లోని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ కాంప్లెక్స్‌లో వచ్చే నెల 9, 10 తేదీల్లో జీ-20 దేశాధినేతల సమావేశం జరగనుంది.