అండర్​ వాటర్​ యాక్షన్​ సీన్స్​లో చైతూ.. 'కస్టడీ' మేకింగ్​ వీడియో​ చూశారా! - కస్టడీ 2023 సినిమా నీటిలోపల షూటింగ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 11, 2023, 7:35 PM IST

Custody Movie 2023 : తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్​లో అక్కినేని నాగచైతన్య నటించిన ద్విభాషా చిత్రం 'కస్టడీ'. మే 12 శనివారం తమిళ్ తోపాటు తెలుగులోనూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కస్టడీలో విరామానికి ముందు వచ్చే నీటిలోపలి సన్నివేశాల చిత్రీకరణ దృశ్యాలను చిత్ర బృందం విడుదల చేసింది. స్కూబా డైవింగ్​లో అనుభవమున్న నాగచైతన్య ఆ సన్నివేశాలను అవలీలగా చేసుకుంటూ వెళ్లగా.. కథానాయిక కృతిశెట్టి మాత్రం కొంత ఇబ్బందిపడిందని చిత్ర బృందం తెలిపింది. నీటి లోపలి సన్నివేశాలు ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తాయని వెల్లడింది. ఈ దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ఈ చిత్రానికి 'మ్యూజిక్ మ్యాస్ట్రో' ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. శ్రీనివాస సిల్వర్​ స్క్రీన్​ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎస్​ఆర్​ కతిర్​ సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరించారు. పోలీస్​ కస్టడీ నేపథ్యంలో సాగే ఈ స్టోరీలో.. నాగ చైతన్య శివ అనే యువకుడిగా కనిపిస్తారు. ఈ చిత్రంలో సంపత్​రాజ్​, శరత్​కుమార్, వెన్నెల కిశోర్​​, ప్రేమ్​జీ, ప్రేమి విశ్వనాథ్​ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.