కొత్త పార్లమెంట్​​ వీడియో రిలీజ్​.. ట్వీట్ చేస్తే మోదీ 'స్పెషల్ గిఫ్ట్'! - నూతన పార్లమెంట్ భవనం ప్రారంభ తేదీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 26, 2023, 5:50 PM IST

Updated : May 26, 2023, 6:09 PM IST

New Parliament building video : మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నూతన పార్లమెంట్‌ భవనానికి సంబంధించిన వీడియోను కేంద్రం విడుదల చేసింది. ఈ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. నూతన పార్లమెంట్​ భవనం ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమన్నారు. పార్లమెంట్​ భవనంపై మీ ఆలోచనలను సొంత వాయిస్ ఓవర్​తో వీడియోను 'మై పార్లమెంట్​ మై ప్రైడ్​' హ్యాష్​ట్యాగ్​తో షేర్ చేయాలని కోరారు. అందులో కొన్నింటిని తాను రీట్వీట్​ చేస్తానని.. వీడియోను మర్చిపోవద్దంటూ చెప్పారు. 

అత్యాధునిక సదుపాయలతో దాదాపు 15 ఏకరాల్లో త్రిభుజాకారంలో పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించారు. ఉభయసభల్లో ఉంచిన అశోక్‌ చక్రం ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతీయ పక్షి నెమలి ఆధారంగా చేసుకొని కొత్త లోక్‌సభ ఛాంబర్‌ను డిజైన్‌ చేశారు. రాజ్యసభ ఛాంబర్‌ను జాతీయ పువ్వు కమలం ఆధారంగా రూపొందించారు. 2020లో పార్లమెంట్​కు శంకుస్థాపన చేయగా..​ మే 28న జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 

Parliament New Building : 64,500 చదరపు మీటర్ల పరిధిలో కొత్త పార్లమెంట్ భవనం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్​తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లు ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు సైతం పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్​సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఉండనున్నాయి.

Last Updated : May 26, 2023, 6:09 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.