Ayodhya Ram Mandir Replica : కలపతో అయోధ్య రామమందిర నమూనా.. దీపావళికి కానుకగా.. - replica of ram mandir ayodhya

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 8, 2023, 2:45 PM IST

Ayodhya Ram Mandir Replica : గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హన్స్‌ ఆర్ట్‌ అనే సంస్థ.. అయోధ్య రామమందిర నమూనాలను అందంగా తయారు చేస్తోంది. కలపతో తయారు చేసిన ఈ మందిరాలు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటి కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తుండటం వల్ల వీటి విక్రయాలు బాగా పెరిగాయి.  

ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో అయోధ్య ఆలయ నమూనాలు తయారు చేసి విక్రయిస్తున్నామని హన్స్ ఆర్ట్​ సంస్థ తెలిపింది. 'మా సంస్థ పక్షులను రక్షించడానికి పక్షుల గూళ్లను తయారుచేస్తుంది. ఆ గూళ్లను ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ రామమందిర కలను సాకారం చేశారు. అందుకే మేము కూడా కలపతో రామమందిర నమూనాను నిర్మించాం. దీపావళికి కానుకగా ఈ మోడల్స్​ను విడుదల చేస్తాం. ఇప్పటికే 300-400 వరకు ఆర్డర్లు వచ్చాయి.' అని పేర్కొంది. హన్స్‌ ఆర్ట్‌.. పక్షుల సంరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ. పక్షుల కోసం గూళ్లను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుంటుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.