శరవేగంగా అయోధ్య మందిర నిర్మాణం.. ఆలయం లోపలి దృశ్యాలు చూశారా? - Inside video of Ayodhya Ram Mandir
🎬 Watch Now: Feature Video

ఆయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ పైకప్పు ఏర్పాటుతో పాటు దాదాపు 90 శాతం గ్రౌండ్ ఫ్లోర్ పని పూర్తైంది. వచ్చే ఏడాది జనవరి నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేసి.. అదే నెల 14 -16 తేదీల మధ్య ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, కళాకారులు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణానికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ వ్యక్తి ఆలయంలో తిరుగుతూ లోపలి దృశ్యాలను చూపిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులుగా ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
రామయ్యకు కానుకలు..
ఆయోధ్య రామయ్య కోసం ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కానుకలు సిద్ధం అవుతున్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన కొందరు భక్తులు.. 3403 కిలోల బరువున్న అగరబత్తిని తయారు చేసి శ్రీరాముడిపై తమ భక్తిని చాటుకున్నారు. ఈ ఏడాది డిసెంబరు చివరికల్లా ఈ అగర్బత్తిని అయోధ్యకు చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. అగరబత్తికి సంబంధించిన వీడియో చూడడానికి కింద ఈ లింక్‌పై క్లిక్ చేయండి.