బంగారు పూతతో అయోధ్య ఆలయం- వెండి నాణేలపై రామ దర్బార్- గిఫ్ట్స్ సూపర్! - బంగారు పూతతో రామమందిర చిత్రం
🎬 Watch Now: Feature Video
Published : Dec 7, 2023, 10:40 PM IST
Ayodhya Gold Plated Items : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామునికి చెందిన వివిధ అంశాలు ప్రతిబింబించే విధంగా బంగారు పూతతో వస్తువులను తయారు చేశారు లఖ్‌నవూకు చెందిన ఓ వ్యాపారి. అయోధ్య ఆలయ రూపాన్ని కూడా రూపొందించారు.
"దీనిని 24 క్యారెట్ల బంగారు రేకుతో తీర్చిదిద్దాము. కింది భాగంలో రామ మందిర చిత్రాన్ని ముద్రించాం. ఈ వస్తువులు ప్రజాదరణ పొందాయి. చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోని పూజామందిరంలో ప్రజలు వీటిని పెట్టుకోవచ్చు. ఇందులో రాముని పాదాలతో పాటు ఆస్థానాన్ని తీర్చిదిద్దాం. ఇతరులకు దీనిని బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ వస్తువులపై రాముని పాదాలు, మంత్రాలు కూడా ముద్రించాం"
- వేదాంశ్ మహేశ్వరి, వ్యాపారి.
బంగారు పూతతో తయారు చేసిన వస్తువులతో పాటు వెండినాణేలు కూడా తయారు చేశారు. ఆ నాణేలపై ఓవైపు రామ్ దర్బార్, మరో వైపు అయోధ్య ఆలయ చిత్రాలను ముద్రించారు. అయితే వస్తువులన్నింటినీ భక్తులంతా కొనుగోలు చేసే విధంగా తక్కువ ధరల్లోనే విక్రయిస్తున్నట్లు వ్యాపారి తెలిపారు. 250 రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అమ్ముతున్నట్లు చెప్పారు. వీటన్నింటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు.