అధికారులపై ఆగ్రహంతో బతికున్న పామును నమిలిన వ్యక్తి.. - వైరల్ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 22, 2023, 8:09 AM IST

Updated : May 22, 2023, 9:55 PM IST

మద్యం మత్తులో బతికున్న పామును నోటితో నమిలాడు ఓ వ్యక్తి. అక్రమణ ఇళ్లను రైల్వే అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్న ఆగ్రహంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఉత్తరాఖండ్​​లోని నైనీతాల్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. లాల్కువాన్ రైల్వే స్టేషన్​ పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే ఆరోపణలతో.. అక్కడి వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇళ్లను సైతం తొలగిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి ఓ పాము వచ్చింది. దాన్ని చూసిన ఓ వ్యక్తి.. మద్యం మత్తులో పాము నోటి భాగాన్ని నమిలేశాడు. అక్కడున్న వారు ఎంత చెప్పిన వినకుండా ఎడాపెడా పామును కొరికేశాడు. అయినా ఆ వ్యక్తికి ఎటువంటి విషం ఎక్కకపోవడం గమనార్హం. ఘటన మొత్తాన్ని అక్కడున్న కొందరు వ్యక్తులు.. వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పోస్ట్​ చేశారు. కాగా వీడియోను చూసిన ఫారెస్ట్ అధికారులు.. ఘటనపై స్పందించారు. దీనిపై దర్యాప్తు జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని చేయకూడదని వారు సూచించారు. 

Last Updated : May 22, 2023, 9:55 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.