Advocate Mulakat Rejected at Rajamahendravaram Central Jail: చంద్రబాబుతో సుంకర కృష్ణమూర్తి ములాఖత్ తిరస్కరణ.. "బార్ కౌన్సిల్​కు ఫిర్యాదు చేస్తాం" - చంద్రబాబుతో సుంకర కృష్ణమూర్తి ములాఖత్ తిరస్కరణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 5:05 PM IST

Advocate Mulakat Rejected at Rajamahendravaram Central Jail : మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కలిసేందుకు రెండు సార్లు ములాఖత్​కు దరఖాస్తు చేస్తే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికారులు తిరస్కరించారని (Chandrababu Mulakat)  హైకోర్టు న్యాయవాది సుంకర కృష్ణమూర్తి చెప్పారు. కారాగారం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుని ప్రత్యక్షంగా కలిసి న్యాయపరంగా అందించాల్సిన సాయంపై చర్చించేందుకు జైలు వద్దకు వచ్చినట్టు చెప్పారు. న్యాయాన్ని కాపాడటానికి.. అసలు ఏం జరిగిందో ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నిస్తే..  జైలు అధికారులు ములాఖత్​కు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని చెప్పారు. న్యాయవాది హక్కుల్ని కాలరాసిన జైలర్ తీరుపై బార్ కౌన్సిల్​కు ఫిర్యాదు చేస్తామని న్యాయవాది ఆయన చెప్పారు. చంద్రబాబుకు జైల్లో కూడా ఎన్ఎస్​జీ సెక్యూరిటీ (NSG Security For Chandrababu In Jail) కల్పించాల్సిన బాధ్యత  న్యాయమూర్తి మీద ఉందని సుంకర కృష్ణమూర్తి అన్నారు.

"న్యాయవాదులకే హక్కులు, రక్షణ లేదు. జైల్లో ఉన్న వాళ్లకి హక్కులు, రక్షణ ఏమీ ఉంటాయి. చంద్రబాబుకి ఎన్ఎస్​జీ సెక్యూరిటీ ఉంది. కాబట్టి చంద్రబాబుకు జైల్లో కూడా ఎన్ఎస్​జీ సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత  న్యాయమూర్తి మీద ఉంటుందని నేను భావిస్తున్నాను."- సుంకర కృష్ణమూర్తి, హైకోర్టు న్యాయవాది  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.