గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి! - కైట్తో ఎగిరిన మనిషి
🎬 Watch Now: Feature Video
శ్రీలంకలో కైట్ ఫెస్టివల్ ప్రతి యేటా ఘనంగా జరుగుతుంది. ఈసారీ చాలా మంది.. వారు రూపొందించిన భారీ కైట్లను ఎగరేశారు. అయితే ఓ భారీ కైట్ను ఎగరేసేందుకు కొందరు జనపనార తాడును వినియోగించారు. వారిలో ఓ వ్యక్తి ఆ తాడును పట్టుకుని గాలిలో ఎగిరిపోయాడు. చాలా సేపు గాలిలోనే ప్రయాణించాడు. చివరికి కింద ఉన్న వారు కైట్ను నియంత్రించడం వల్ల గాలిలో ఉన్న వ్యక్తి కిందకు దిగగలిగాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Last Updated : Dec 23, 2021, 4:48 PM IST