బెజోస్ రోదసి యాత్ర ఎన్ని కిలోమీటర్లు సాగిందంటే? - రోదసి యాత్ర జెఫ్ బెజోస్
🎬 Watch Now: Feature Video

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ విజయవంతంగా రోదసి యాత్రను పూర్తి చేశారు. బెజోస్ బృందంలో అతని సోదరుడు మార్క్ బెజోస్, ప్రముఖ మహిళా పైలట్ వేలీ ఫంక్ (82), ఆలివర్ డేమన్ (18) ఉన్నారు. మంగళవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం).. పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వ్యోమనౌక మొత్తం 106 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయాణించింది. 100 కిలోమీటర్ల ఎత్తులో బెజోస్ బృందం కొన్ని క్షణాల పాటు మైక్రోగ్రావిటీ స్థితిని అనుభవించినట్లు బ్లూ ఆరిజిన్ వెల్లడించింది.