లక్షల కొద్దీ ఎర్ర పీతలు.. దారి మొత్తం అవే.. - ఎర్రని పీతల ఫొటోలు
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రేలియాలోని 'క్రిస్మస్ ఐలాండ్' అనే ప్రాంతం ఎర్రని పీతలతో నిండిపోయింది. ప్రతి ఏడాదిలాగే సముద్రంలోకి వలస వెళుతున్న లక్షలాది పీతలతో ఆ ప్రాంతమంతా ఎర్రగా మారింది. చంద్రుని వేగాన్ని బట్టి ఎర్రపీతల కదలిక ఆధారపడి ఉంటుందని నేషనల్ పార్క్ ఉద్యోగులు తెలిపారు. ప్రత్యేకంగా నిర్మించిన వంతెనల మీదుగా ఇవి ప్రయాణిస్తాయని చెబుతున్నారు. పీతలు వాహనాల కింద పడి చనిపోకుండా కిలోమీటర్ల కొద్దీ బారికేడ్లు, గుర్తులు ఏర్పాటు చేశారు. దీనికోసం నెలల ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నమవుతుంటారు. ప్రతి ఆడ పీత సముద్రంలో లక్ష గుడ్లు పెడుతుందని.. ఒక నెల తర్వాత పిల్ల పీతలతో అడవికి తిరిగి వస్తాయని సిబ్బంది తెలిపారు.