బస్సులో నుంచి జారి పడి మహిళ మృతి - బస్సులో నుంచి పడి మహిళ మృతి
🎬 Watch Now: Feature Video
కదులుతున్న బస్సులో నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు తెన్‌కాశీ జిల్లాలో(Tamil Nadu Tenkasi News) జరిగింది. శంకరన్‌కోవిల్ ప్రాంతానికి చెందిన మహేశ్వరి... తన కుమార్తె వివాహం కోసం షాపింగ్ చేసేందుకు సమీప పట్టణానికి వెళ్లి, ఓ మినీ బస్సులో తిరిగివస్తోంది. తన స్టాప్‌లో దిగేందుకు సిద్ధమవుతుండగా.. బస్సు డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో బస్సులో నుంచి మహేశ్వరి కిందపడింది. తీవ్రంగా గాయపడ్డ మహేశ్వరిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మృతి చెందింది. బస్సు యజమాని, డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.