కర్రలతో కొట్టి.. చిత్రహింసలు పెట్టి.. యువకుడి దారుణ హత్య - హరియాణా న్యూస్ టుడే
🎬 Watch Now: Feature Video
ఓ యువకుడ్ని 15 మంది వ్యక్తులు కొట్టి చంపిన ఘటన హరియాణాలో వెలుగుచూసింది. మహేంద్రగఢ్‌లోని మాల్దా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తనను వదిలేయమని ప్రాధేయపడుతున్నప్పటికీ గౌరవ్‌ను కొందరు కర్రలతో దారుణంగా కొట్టడం దీనిలో గమనించవచ్చు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గౌరవ్ అనే వ్యక్తికి, అతని స్నేహితుడు రవికి మధ్య గొడవ జరిగిందని.. దీనితో రవి తన సహచరులతో కలిసి గౌరవ్‌పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. అయితే గౌరవ్ తమను చంపేస్తానని బెదిరించాడని.. అందుకే కొట్టామని ప్రధాన నిందితుడు చెప్పడం గమనార్హం.