పట్టపగలే దోపిడీ.. గన్తో బెదిరించి బ్యాంకు లూఠీ! - Three robers looted a Bank in daylight
🎬 Watch Now: Feature Video
Bank Robbery: రాజస్థాన్ డూంగర్పుర్లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ముసుగు ధరించి గన్తో బ్యాంకులోకి వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. ఉద్యోగులను బెదిరించారు. రూ.1.18 లక్షలను చోరీ చేశారు. బ్యాంకు బయట ఉన్న ప్రజల నుంచి తప్పించుకోవడానికి 10,20 రూపాయల నోట్లను వెదజల్లారు. ప్రజలు వాటిని ఏరుకునే పనిలో ఉండగా.. దుండగులు బైక్పై ఉడాయించారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST