వృద్ధ టీచర్ని దారుణంగా కొట్టిన మహిళా కానిస్టేబుళ్లు - వృద్ధ టీచర్ని రోడ్డుపై కొట్టిన కానిస్టేబుళ్లు
🎬 Watch Now: Feature Video
బిహార్‌లోని కైమూర్‌లో ఓ అమానవీయ ఘటన జరిగింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఒక వృద్ధ టీచర్ని విచక్షణారహితంగా కొట్టారు. వృద్ధ టీచర్ నావల్ కిషోర్ పాండే డీపీఎస్ పాఠశాల పర్మల్‌పూర్‌లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధిస్తున్నాడు. 3గంటల సమయంలో పాఠశాల నుంచి సైకిల్‌పై జయప్రకాష్ చౌక్ నుంచి ఇంటికి వస్తున్నాడు. అయితే మార్గ మధ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్‌ను పట్టించుకోకుండా రోడ్డు దాటుతున్నాడు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు టీచర్‌ను ఆపే ప్రయత్నం చేశారు. అతడు పట్టించుకోకుండా రోడ్డు దాటుతున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుళ్లు వృద్ధుడిని రోడ్డు మీద ఆపి కొట్టడం ప్రారంభించారు. దీనిని గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పోలీసు అధికారులు కానిస్టేబుళ్లపై తదుపరి విచారణకు ఆదేశించారు. వారిని 3 నెలల పాటు విధుల నుంచి తప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.