మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేశారని తండ్రికొడుకులను చితకబాదిన మహిళలు - కేరళలో కారు ఆపి మరీ ఇద్దరిని చితకబాదిన మహిళలు
🎬 Watch Now: Feature Video
ఓ మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేశారన్న నెపంతో తండ్రికొడుకులను చితకబాదారు 59 మంది మహిళలు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో జరిగింది. కారులో వెళ్తున్న తండ్రీకొడుకులిద్దరినీ ఆపి మరీ దాడికి దిగారు మహిళలు. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలు కాగా వాహనం అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులుగా ఉన్న 11 మంది మహిళలను వియ్యూరులోని మహిళా జైలుకు తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST