క్షమించమని దండం పెట్టి కాళీమాత నగలు ఎత్తుకెళ్లిన దొంగలు - Thieves stole money and jewelery from temple hundi

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 25, 2023, 8:21 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని మా కాళీ మహాదేవ్ జీ అక్షయ్ మందిర్​లో దొంగతనం జరిగింది. సోమవారం రాత్రి ఇద్దరు దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. దొంగలు ముందుగా కాళీమాతకు దండం పెట్టుకుని.. క్షమించమని మొక్కి మరీ దొంగతనం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తరువాత హుండీలోంచి డబ్బు, వస్తువులు చోరీ చేశారు. దొంగలు గుడి తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. నాలుగు బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం​, ఓ నెక్లెస్, రూ.వెయ్యి​ నగదు అపహరణ చేసినట్లు వెల్లడించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.