South Central Railway Increase General Coaches : రైళ్లలో చాలా వరకు పేద, మధ్య తరగతి వర్గం వారే ప్రయాణిస్తుంటారు. వీరిలో ముఖ్యంగా జనరల్ బోగీ టికెట్ తక్కువగా ఉంటుందని పేదలు ఆ టికెట్నే కొనుక్కోని ప్రయాణిస్తుంటారు. కానీ అందులో ప్రయాణించాలంటే నరకం కంటే మరొకటి లేదు. ఎందుకంటే ప్రతి రైలు బండికి కేవలం వెనక, ముందు కలిపి రెండు జనరల్ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. దీంతో వారి ప్రయాణ బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ఇక నుంచి జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.
రైళ్లలో సామాన్య ప్రయాణికుల ఇబ్బందుల్ని తగ్గించేందుకు జనరల్ బోగీల సంఖ్యను 2 నుంచి 4కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే 2 విడతల్లో మొత్తం 31 రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచామని, అతి త్వరలో మరో 9 రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు వస్తాయి : హైదరాబాద్-ముంబయి-హైదరాబాద్ (12702/12701), హైదరాబాద్-ముంబయి-హైదరాబాద్ (22731/22732), తిరుపతి-హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి (12707/12708), హైదరాబాద్-జైపుర్-హైదరాబాద్ (12720/12719), నాందేడ్-అమృత్‌సర్-నాందేడ్ (12715/12716), హైదరాబాద్-తాంబరం-హైదరాబాద్ (12760/12759), హైదరాబాద్-విశాఖపట్నం-హైదరాబాద్ (12728/12727), సికింద్రాబాద్-హిస్సార్-సికింద్రాబాద్(22737/22738), తిరుపతి-హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి (12793/12794). వీటిలో ఆధునిక ఎల్‌హెచ్‌బీ (LGB) బోగీలు వస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ వెల్లడించారు.
రైల్వేలో కొత్త టైం టేబుల్ : నూతన సంవత్సరం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రైళ్ల ప్రయాణ సమయాల్లో రైల్వే బోర్డు మార్పులు చేర్పులు చేసింది. నూతన టైం టేబుల్ నేటి నుంచి అమలులోకి వస్తుందని, వివరాలు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) వెబ్‌సైట్‌లో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు, రైల్వే సర్వీసులను మెరుగుపరిచేందుకు రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది.
రూ.5.03 కోట్ల గంజాయిని స్వాధీనం : 2024లో 1,385 మంది పిల్లలను రక్షించినట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశామని, 5.03 కోట్ల రూపాయల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
ప్రయాణికులకు విజ్ఞప్తి : జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు
సికింద్రాబాద్ నుంచి 'మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర' - మరో పర్యాటక రైలును ప్రకటించిన ఐఆర్‌సీటీసీ