దేవుడి దర్శనం కోసం 2 కిలోమీటర్లు నడిచిన రాష్ట్రపతి - murmu went to puri temple
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16890479-thumbnail-3x2-president.jpg)
ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో పూరీకి చేరుకున్న ముర్ము జగన్నాథుడి సన్నిధికి కాలినడకన వెళ్లారు. ప్రజలకు అభివాదం చేస్తూ దాదాపు 2 కి.మీ మేర నడిచి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రహదారి వెంట రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. సింహద్వారం ముందు ఉన్న అరుణ స్తంభాన్ని దర్శించుకున్న ముర్ము దాన్ని చేతితో స్పృశించి లోనికి వెళ్లారు. అనంతరం ఆలయ అర్చకులు ముర్మును గర్భగుడిలోకి తీసుకెళ్లారు. దేవుడి దర్శనం అనంతరం ముర్ము గర్భగుడిలో దీపం వెలిగించారని పూజారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST